సర్వం సిద్ధం
Published Wed, Mar 12 2014 2:08 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 103 కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన 68,716 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.వెంకటేశ్వరరావు చెప్పారు. గతేడాది కంటే ఈసారి పది పరీక్షా కేంద్రాలను తగ్గించామన్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని అమలుచేయనున్నట్టు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, 9 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలసమైనా కేంద్రాల్లోకి అనుమతించమని తెలిపారు.
పటిష్ట ఏర్పాట్లు
జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు సిట్టింగ్ స్క్వా డ్లు, రెండు జిల్లా స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక స్క్వాడ్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో పోలసానిపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, చింతలపూడి, ఆచంట, జీలుగుమిల్లి, పోలవరంలో ఎనిమిది కేం ద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్టు భావించి అక్కడ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయనున్నారు. పరీక్షా కేం ద్రాల వద్ద సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08812-230197కు ఫిర్యాదు చేయవచ్చని ఆర్‌ఐవో సూచించారు.
పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు
ప్రథమ సంవత్సరం (జనరల్) : 29,921
బాలురు : 13,760 బాలికలు : 16,161
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్) : 3,596
బాలురు : 1,878 బాలికలు : 1,718
ద్వితీయ సంవత్సరం (జనరల్) : 29,548
బాలురు : 14,332 బాలికలు : 15,216
ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) : 5,651
బాలురు : 2,574 బాలికలు : 3,077
Advertisement