
నేడు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు శనివారం ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు శనివారం ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ వీటిని విడుదల చేస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఫలితాలను www.sakshieducation.com, http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in, www.apit.ap.gov.in వెబ్‌సైట్‌లతోపాటు ఇతర వెబ్‌సైట్‌ల లోనూ పొందవచ్చు.
బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్ లైన్ నుంచి 1100 నంబర్‌కు లేదా ఏదైనా ల్యాండ్‌లైన్/మొబైల్ ఫోన్ నుంచి 18004251110 నంబరుకు ఫోన్ చేసి పొందవచ్చు.
* ఈసేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీసు సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ తెలుసుకోవచ్చు.
* ఎయిర్‌టెల్ వినియోగదారులు 52070 నంబర్‌కు, ఇతర మొబైల్ వినియోగదారులు 58888 నంబర్‌కు ఫోన్ చేయాలి.
* బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు INTER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నంబర్ టైప్ చేసి 53346 నంబర్‌కు మెసేజ్ చేసినా ఫలితాలు తెలుస్తాయి.
* ఇతర వినియోగదారులు ఐ్కఉ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబర్ టైప్ చేసి 54242 నంబర్‌కు మెసేజ్ పంపాలి. వొకేషనల్ విద్యార్థులు ఐ్కఉగ2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్ టికెట్ నంబర్ టైప్ చేసి 54242 నంబర్‌కు మెసేజ్ పంపితే చాలు.
* ఏదైనా మొబైల్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి 57272 నంబర్‌కు మెసేజ్ పంపి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే అ్క12 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 58888 నంబర్‌కు మేసేజ్ చేసి కూడా వాటిని పొందవచ్చు.
* జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు వారి కళాశాలల ఫలితాలను http://bieap.cgg.gov.in వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో తెలుసుకోవచ్చు.