హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా వాటర్ బోర్డుకు లేఖ రాశారు. రాష్ట్రంలో పంటలు కీలక దశలో ఉన్నాయని, వెంటనే నీటిని విడుదల చేయకపోతే అపారనష్టం సంభవిస్తుందని అధికారులు లేఖలో పేర్కొన్నారు.