సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జీవోపై సుప్రీం కోర్టు బుధవారం స్టే విధించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌పై 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అంతవరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 17 స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జీవో 176ని జారీ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : షెడ్యూల్ ప్రకారమే ‘స్థానిక’ ఎన్నికలు)
Comments
Please login to add a commentAdd a comment