జూన్ 6న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్: వ్యవసాయ మార్కెటింగ్, ఏరోస్పేస్, డిపెన్స్, ఇండస్ట్రియల్ విధానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూన్ 6న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కొందరు మంత్రులు సూచించగా, ఇప్పుడే వద్దని... రాజధాని పనులు ప్రారంభమయ్యాక ఆహ్వానిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏడాది పాలన పూర్తైనందున జూన్ 8న బహిరంగ సభలో కొత్త పథకాలు ప్రకటించాలని భేటీలో నిర్ణయించారు. మద్యం పాలసీపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాత విధానాన్ని కొనసాగించాలని కొందరు సూచించగా, కొత్త పాలసీ తీసుకురావాలని మరికొందరు అభిప్రాయపడ్డారు.