
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సోమవారం మీడియా సమావేశం ద్వారా నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఈనెల 11 నుంచి 13 వరకు నామిషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్ పత్రాల పరిశీలన, 16న ఉపసంహరణ, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. మార్చి 23న పోలింగ్ నిర్వహించి, 27న ఫలితాలను విడుదల చేయనున్నారు.
కాగా రాష్ట్రంలోని మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా 12 కార్పొరేషన్లకు మాత్రం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో 104 మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. వివిధ కారణాలతో 29 మున్సిపాలిటీ, పలు నగర పంచాయతీల్లో ఎన్నికను వాయిదా వేశారు.
వాయిదా పడిన 29 మున్సిపాలిటీలు.. జిల్లాల వారిగా
శ్రీకాకుళం : ఆముదాలవలస, రాజాం
ప. గో : భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు
కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి
గుంటూరు : బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల, దాచేపల్లి
ప్రకాశం : కందుకూరు, దర్శి
నెల్లూరు : గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం
చిత్తూరు : శ్రీకాళహస్తి, కుప్పం
వైఎస్‌ఆర్ జిల్లా : రాజంపేట, కమలాపురం
కర్నూలు : బేతంచర్ల
అనంతపురం : పామిడి, పెనుకొండ
Comments
Please login to add a commentAdd a comment