ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ 27కి వాయిదా | APNGOs Strike Petition Hearing Adjourned To Friday | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ 27కి వాయిదా

Published Tue, Sep 24 2013 2:17 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ 27కి వాయిదా - Sakshi

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ 27కి వాయిదా

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మరోసారి వాయిదా పడింది.  సమ్మె రాజ్యాంగ విరుద్ధమంటూ  దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.   శుక్రవారం జరిగే విచారణలో వాదనలు లిఖితపూర్వకంగా అందజేయాలని కోర్టు పిటిషనర్‌, ప్రతివాదుల్ని ఆదేశించింది.

రెండు పేజీలకు మించకుండా ఈ వాదనలు ఉండాలని న్యాయస్థానం సూచించింది.  ఏపీఎన్జీవోల సమ్మె చెల్లదని దాఖలైన పిటిషన్‌పై గత ఎనిమిది రోజులుగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.  సీమాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  అనేక ఉద్యోగ సంఘాలు, నాయకులు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement