అప్పన్నకు హైకోర్టు జస్టిస్ పూజలు
సింహాచలం, న్యూస్‌లైన్: రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు సతీసమేతంగా శని వారం రాత్రి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శిం చుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు అర్చకు లు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో జస్టిస్ పేరిట అర్చకులు అష్టోత్తరం పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆశీర్వచనం అందజేశారు.
సంపత్ వినాయకుని దర్శనం
సిరిపురం : హైకోర్ట్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు దంపతులు శనివారం ఉదయం ఆశీల్‌మెట్ట వద్ద ఉన్న సంపత్ వినాయకుణ్ణి దర్శించుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొవడానికి నగరానికి వచ్చిన ఆయన ఆలయాలనికి వచ్చిన సందర్భంగా ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు.
అప్పన్న సన్నిధిలో ప్రముఖులు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని వరం గల్ జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి.చక్రధర్‌బాబు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బిశ్వాల్ సతీసమేతంగాను దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద వీరికి అర్చకులు పూర్ణకుం భంతో స్వాగ తం పలికారు. అనంతరం వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణ చేశారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్ అందజేశారు.