
సాక్షి, తిరుపతి : కరోనా నేపథ్యంలో భారతీయులలో ఐక్యతా భావాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ లైట్ దియా’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి లైట్స్ ఆర్పే ముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైట్స్ ఆర్పినప్పటికీ నివాస గృహంలోని ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్‌లు, ఏసీలను ఆ 9 నిమిషాల పాటు ఆన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఒకే సారి అన్నీ ఆఫ్ చేస్తే పవర్ గ్రిడ్ కూలి పోయే ప్రమాదం ఉందన్నారు. ( కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం )
పవర్ గ్రిడ్ కూలకుండా ఉండటానికి తాము కూడా కొన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతుల పంపు సెట్లకు రాత్రి 8:30 గంటల నుంచే పవర్ ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్ వల్ల కరెంట్ బిల్లులు ఇవ్వడం వీలు కావడం లేదని, వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన బిల్లు మొత్తాన్నే ఇప్పుడు చెల్లించవచ్చని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినా డిస్కనెక్షన్ ఉండదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment