haranath
-
సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం
ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కూతురే పద్మజా రాజు. ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా ‘‘గోకులంలో సీత, తొలిప్రేమ’’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర, దివంగత నటులు సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మజా రాజు ఇటీవల ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ సమంత షాకింగ్ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్ నుంచి సామ్ అవుట్? -
కృష్ణ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న ఆ హీరోని ఆదుకున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ కృష్ణ సాహసాల హీరో మాత్రమే కాదు.. మంచి మనుసున్న వ్యక్తి కూడా. కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడంలోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అలా ఆయన నుంచి సహాయాన్ని పొందినవారిలో సీనియర్ హీరో హరనాథ్ కూడా ఉన్నారు. కృష్ణకంటే ముందుగానే హరనాథ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అందగాడుగా మంచి మార్కులు కొట్టేసిన హరనాథ్, రొమాంటిక్ హీరోగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఒకానోక సమయంలో హరనాథ్ మద్యానికి బానిస అయ్యాడట. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో అవకాశాలు తగ్గాయట. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ దీంతో హరనాథ్‌ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇక దిక్కతోచని స్థితిలో హరనాథ్ కృష్ణను కలుసుకోవడానికి పద్మాలయ స్టుడియోస్కి వెళ్లారట. ఆయన వచ్చిన విషయాన్ని సిబ్బంది కృష్ణ దగ్గరికి వెళ్లి చెప్పగానే ఆయనే స్వయంగా కిందికి వెళ్లి హారనాథ్ను లోపలికి తీసుకువెళ్లి మాట్లాడారట. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కృష్ణ ఇంటికి తీసుకుని వెళ్లి అతిథి మర్యాదలు చేశారట. అంతేకాదు కొన్ని రోజులు ఆయనను ఇంట్లోనే ఉంచుకున్నారట. ఈ క్రమంలో ఆయనకు ధైర్యం చెప్పి.. పెద్ద మొత్తంలో డబ్బును ఆయన చేతిలో పెట్టారట కృష్ణ. అలా తన కోస్టార్‌ను కష్టాల్లో ఆదుకుని ఆయన మంచి మనసు చాటుకున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణ ఎప్పుడూ ఎక్కడా చెప్పకపోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. -
ఏపీ ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్)కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ పంపిణీలో ఆవిష్కరణల అంశంలో చేస్తున్న కృషిలో ఏపీ ఎస్పీడీసీఎల్ జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డులు–2022 ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యూరీ సభ్యుల నుంచి ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.హరనాథరావు అందుకున్నారు. ఎస్పీడీసీఎల్కు జాతీయ అవార్డు లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. -
మోదీ పిలుపు: ఈ జాగ్రత్తలు పాటించండి!
సాక్షి, తిరుపతి : కరోనా నేపథ్యంలో భారతీయులలో ఐక్యతా భావాన్ని నింపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘ లైట్ దియా’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి లైట్స్ ఆర్పే ముందు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్ సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైట్స్ ఆర్పినప్పటికీ నివాస గృహంలోని ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలను ఆ 9 నిమిషాల పాటు ఆన్‌లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఒకే సారి అన్నీ ఆఫ్ చేస్తే పవర్ గ్రిడ్ కూలి పోయే ప్రమాదం ఉందన్నారు. ( కరోనా: డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం ) పవర్ గ్రిడ్ కూలకుండా ఉండటానికి తాము కూడా కొన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలోని రైతుల పంపు సెట్లకు రాత్రి 8:30 గంటల నుంచే పవర్ ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్ వల్ల కరెంట్ బిల్లులు ఇవ్వడం వీలు కావడం లేదని, వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన బిల్లు మొత్తాన్నే ఇప్పుడు చెల్లించవచ్చని చెప్పారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయినా డిస్కనెక్షన్ ఉండదని తెలిపారు. -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టు ట్రస్ట్ సిగలో మరో రికార్డు వచ్చి చేరింది. 2019 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల సరకు రవాణాలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో నాలుగో స్థానానికి పరిమితమైన వీపీటీ.. ఈ ఏడాది 10 శాతం వృద్ధి నమోదు చేసుకుని ఒక స్థానం మెరుగు పరచుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు 23.70 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసి రికార్డు సృష్టించింది. గతేడాది 21.52 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.18 మిలియన్ టన్నులు అధికం. విశాఖ పోర్టు ట్రస్టు సరకు రవాణాలో వృద్ధిని సాధించడంలో ఇనుప ఖనిజం, పెల్లెట్స్, కుకింగ్ కోల్, పెట్రోలియం ఉత్పత్తులు, కంటైనర్ కార్గో వంటివి ప్రధాన పాత్ర పోషించాయి. అధునాతన మార్కెటింగ్ వ్యూహాలు.. ఎప్పటికప్పుడు సరకు రవాణాలో ఆధునిక వ్యూహాల్ని అనుసరిస్తూ.. విశాఖ పోర్టు ట్రస్టు దూసుకెళ్తోంది. ఇన్నర్ హార్బర్లో పనామాక్స్ సామర్థ్యం కలిగిన మూడు బెర్తుల నిర్మాణంతో పాటు ఆయిల్ రిఫైనరీ–3లో అదనపు ఆయిల్ హ్యాండ్లింగ్ సామర్ధ్యం పెంపుతో పాటు ఆయిల్ రిఫైనరీ 1, ఆయిల్ రిఫైనరీ 2 బెర్తులను అభివృద్ధి చేసింది. దీనికి తోడు 100 టన్నుల సామర్ధ్యం కలిగిన హార్బర్ మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసింది. కస్టమర్లకు ఎండ్ టూ ఎండ్ లాజిస్టిక్ సదుపాయాన్ని కల్పిస్తూ తమిళనాడు ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్తో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖ పోర్టు ట్రస్టు మైన్ల వద్ద వ్యాగన్ లోడింగ్, కార్గో నిల్వ, షిప్పుల్లోకి లోడింగ్, రైల్వే వ్యాగన్ల ఏర్పాటు తదితర సదుపాయాల్ని కల్పిస్తోంది. ఇదే తరహా లాజిస్టిక్ సదుపాయాలతో ఎన్ఎండీసీతో నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు రవాణాపై త్వరలో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల లక్ష్యం విశాఖ పోర్టు ట్రస్టు కార్గో హ్యాండ్లింగ్‌లో మూడో స్థానంలో నిలిచి పోర్టు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. పక్కనే ప్రైవేటు పోర్టు ఉన్నప్పటికీ కార్గో హ్యాండ్లింగ్‌లో పెరుగుదలను నమోదు చేయడం విశేషం. భవిష్యత్తులో మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతాం. ఈ ఏడాది చివరికి పోర్టు ద్వారా 70 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – పీఎల్ హరనాథ్, విశాఖపోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ -
వినోదం గ్యారెంటీ
‘హోప్’, ‘చంద్రహాస్’, ‘వెన్నెల’ వంటి చిత్రాలను నిర్మించి, నటించిన పొలిచర్ల హరనాథ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘టిక్ టాక్’ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారాయన. ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. హరనాథ్ మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హారర్ నేపథ్యంలో ‘టిక్ టాక్’ తీస్తున్నా. ఇదొక పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రం. అశ్లీలం ఉండదు, చిన్నపిల్లలను భయపెట్టే హారర్ కాదు. నాకు సినిమాలు ఆత్మతో సమానం. అందుకు తగ్గట్లుగానే జీవిస్తున్నాను. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకున్నా. ఈ చిత్రం తర్వాత వచ్చే రెండేళ్లలో ఐదు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ స్థాయి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. నిషిగంధ, మౌనిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వంశీకృష్ణ, సంగీతం: ఎస్ఆండ్బీ మ్యూజిక్ మిల్. -
నాన్నా..నీవు కన్నుమూసిన చోటే..
14ఏళ్ల క్రితం తండ్రి మృత్యువాత పడిన ప్రాంతంలోనే కుమారుడూ.. పోలీసాఫీసర్ కావాలనే కల చెదిరిపోయింది హరనాథ్ కుటుంబంపై పగబట్టిన విధి విశాఖపట్నం: తాను మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన మండల హరనాథ్ కల చెదిరిపోయింది. చదువుకుని పోలీస్ ఆఫీసర్ కావాలన్న అతని ఆశను మృత్యువు తుంచేసింది. సబ్బవరం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయి, అవయవదానం చేసిన హరనాథ్‌కు చిన్నప్పట్నుంచి పోలీస్ ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ తన లక్ష్యం గురించే ఎక్కువగా చెప్పేవాడు. డిగ్రీ అయ్యాక పోలీస్ సెలక్షన్ కోసం కోచింగ్ తీసుకుంటానని అనేవాడు. ‘ముందు బాగా చదువుకుని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వు’ అంటూ కుటుంబీకులు సరదాగా అనేవారు. హరనాథ్ ఇప్పుడు అర్థాంతరంగా తనువు చాలించడాన్ని వీరంతా గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. హరనాథ్ తాత, నాన్నమ్మలతో సన్నిహితంగా మెలిగేవాడు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఐదో ఏట వచ్చే వరకు వారి దగ్గరే పెరిగాడు. చదువుల కోసం తల్లితో బర్మా క్యాంపు వచ్చాక సెలవులకు వారి వద్దకే వెళ్తుండేవాడు. అలాగే దసరా సెలవుకు తాతగారింటికి వెళ్లి పూజా సామగ్రి కోసం వెళ్తూ లారీ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు. 14 ఏళ్ల క్రితం తండ్రి : సుమారు 14 ఏళ్ల క్రితం అంటే 2001 ఏప్రిల్‌లో హరనాథ్ తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశేషమేమిటంటే హరనాథ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే లారీ ఢీకొని ఆయన దుర్మరణం పాలయ్యారు. తండ్రీకొడుకులిద్దరు ఒకే ప్రాంతం లో ప్రమాదానికి గురై మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. భర్త మరణానంత రం పుష్పలత పెద్ద కొడుకు హరనాథ్‌తో పాటు ఇద్దరు క వల పిల్లల (రాము, లక్ష్మణ)లను చదువుల కోసం నగరంలోని బర్మా కాంపునకు వచ్చేసింది. భర్తను కోల్పోయి నా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడి పిల్లలను చది విస్తోంది. ఈ తరుణంలో పెద్ద కొడుకును పోగొట్టుకున్న ఆమె సెల్ఫోన్లో ఉన్న కొడుకు ఫోటోను చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తోంది. అంతటి విషాదంలోనూ కొడుకు అవయవ దానానికి ముందుకు వచ్చి ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించడాన్ని పలువురు శ్లాఘిస్తున్నారు. ఒత్తిడితో పనికి రాని గుండె..: హరనాథ్ గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చాలనుకున్నారు. అందుకు చార్టర్డ్ ఫ్లైట్‌ను సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గుండెపై ఒత్తిడి అధికం కావడం వల్ల కేవలం కవాటాలను మాత్రమే వైద్యులు చెన్నై తీసుకెళ్లారు. హరనాథ్ మృతదేహానికి ఆదివారం బర్మా క్యాంపు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖకు చెందిన మండల హరనాథ్(17) నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా అతడు అమ్మమ్మ గారి ఊరు పెబ్బవరం వెళ్లాడు. అక్కడే ఈ నెల 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈనెల 23న హరనాథ్‌ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అతని తండ్రి లేకపోవటంతో తల్లి పుష్పలత, తాత అప్పలనాయుడుతో స్థానిక జీవన్‌దాన్ కోఆర్డినేటర్ ఇందిర మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఇండస్ ఆస్పత్రిలో అవయవ దానానికి సరైన సదుపాయాలు లేక పోవడంతో పక్కనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి మార్చారు. ఈ మేరకు గుండెను చెన్నైలోని ఫోర్టిస్ ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని వైజాగ్‌లోని కేర్ ఆస్పత్రికి, మరో కిడ్నీని మణిపాల్ ఆస్పత్రిలో పేషెంట్‌కు, నేత్రాలను స్థానిక ఐ బ్యాంక్‌కు ఇచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. -
హుందా నటుడు...
నాగిన్ స్టార్ హిందీలో ప్రదీప్ కుమార్లో కనిపించే హుందాతనం తెలుగులో హరనాథ్‌లో చూసేవాళ్లమా? చక్కటి రూపాలతో హుందా అయిన నటనతో ఆకట్టుకున్నవాళ్లే ఇద్దరూ. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ వెండితెర మీద ఒక వెలుగు వెలిగి నిశ్శబ్దంగానే తెరమరుగు అయ్యాడు. తొలి రోజుల్లో ఆయన నటించిన ‘ఆనంద్ మఠ్’ క్లాసిక్. అందులో ‘వందే మాతరం’... అంటూ ఆయనపై చిత్రీకరించిన పాట పెద్ద హిట్. బీనాదేవితో చేసిన ‘అనార్కలి’, వైజయంతి మాల తో చేసిన ‘నాగిన్’ ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘తాజ్ మహల్’ వంటి మ్యూజికల్‌కు ఆయనే కథానాయకుడు అన్న విషయం కూడా ఎవరూ మర్చిపోరు. మొదట బెంగాలీ సినిమాల్లో ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించిన ప్రదీప్ కుమార్ ఆ రోజుల్లో లీడింగ్ హీరోయిన్లందరితోనూ నటించాడు. వాళ్లలో మీనా కుమారితో ఆ తర్వాత మధుబాల తో చాలా సినిమాలు చేశాడు. కాని మలిదశ హీరోయిన్లు ఆయన పక్కన కనిపించడానికి పెద్దగా ఇష్టపడలేదు. మీనా కుమారితో ఆయనకు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ‘ఆప్నే యాద్ దిలాయాతో ముఝే యాద్ ఆయా’ (ఆర్తి), ‘హమ్ ఇంతెజార్ కరెంగే తెరా ఖయామత్ తక్’ (బహు బేగమ్), ‘దిల్ జో న కెహ్ సకా’ (భీగీ రాత్)... ఇలా చెప్తే చాలానే ఉన్నాయి. ‘తాజ్ మహల్’ చేశాక ప్రదీప్ కుమార్ రాను రాను జమిందారు, నవాబు వంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది. డబ్బున్న పెద్దమనిషి పాత్ర చేయాలంటే ప్రదీప్ కుమార్‌నే పిలిపించేవారు. అయితే అవేమీ ఆయనకు పేరు తెచ్చిన పాత్రలు కాదు. చివరి వరకూ ఆర్థికంగా కూడా హుందాగానే జీవించిన ప్రదీప్ కుమార్ 2001లో తన 76వ ఏట మరణించాడు. అయినప్పటికీ ఇవాళ్టికీ ఆయన పాట వినిపించకుండా ఈ దేశంలో రోజు గడవదు. ‘జో వాదా కియా ఓ నిభానా పడేగా... నిభానా పడేగా’... -
నటుడు హరనాథ్ భార్య మృతి
చెన్నై : దివంగత నటుడు హరనాథ్ సతీమణి భానుమతి దేవి (70) శనివారం చెన్నైలో మృతి చెందారు. హరనాథ్‌కు భార్య భానుమతి దేవి, ఇద్దరు పిల్లలు శ్రీనివాస రాజు, పద్మజ ఉన్నారు. 1984లో హరనాథ్ కన్ను మూశారు. తదనంతరం శ్రీనివాసరాజు తొలి ప్రేమ, చిరుజల్లు వంటి చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఆయన సోదరి పద్మజ నిర్మాత జీవీజీ రాజు భార్య. కోనసీమకు చెందిన భానుమతి జమీందారి కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని కుమారుడు శ్రీనివాసరాజు ఇంట్లో ఆమె ఉంటున్నారు. వ యో భారంతో ఆమె శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెకు సమాచారం అందించారు. చెన్నై వలసరవాక్కంలోని నివాసంలో భౌతిక కాయాన్ని ఆప్తుల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం ఉదయం పది గంటలకు పోరూర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. -
స్నేహమెంత మధురం..!
మెట్రో లైఫ్ నేపథ్యంలో ఫ్రెండ్షిప్ ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరె వర్’. ‘చంద్రహాస్’, ‘హోప్’ చిత్రాలను నిర్మించిన హరనాథ్ పొలిచర్ల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. హరనాథ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం స్నేహం విలువను చాటిచెప్పే సినిమా’’ అని తెలిపారు. ఈ చిత్రం ఆయన కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోవాలని దర్శకుడు సూర్యకిరణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రచయిత శివశక్తి దత్తా, హీరోయిన్లు సురభి, ఏంజెలీనా, నటుడు విశ్వరామ్, ఛాయగ్రాహకుడు సి.హెచ్ గోపీనాథ్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి మోపిదేవి సోదరడు