మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్బాబు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపల్లె నియోజకవర్గంలోని మోపిదేవి ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్లనున్నారు.