ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ | Student Brain Dead in visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్

Published Sat, Oct 24 2015 12:23 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ - Sakshi

ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖకు చెందిన మండల హరనాథ్(17) నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా అతడు అమ్మమ్మ గారి ఊరు పెబ్బవరం  వెళ్లాడు.  అక్కడే ఈ నెల 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈనెల 23న హరనాథ్‌ను బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు.


అతని తండ్రి లేకపోవటంతో తల్లి పుష్పలత, తాత అప్పలనాయుడుతో స్థానిక జీవన్‌దాన్ కోఆర్డినేటర్ ఇందిర మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఇండస్ ఆస్పత్రిలో అవయవ దానానికి సరైన సదుపాయాలు లేక పోవడంతో పక్కనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి మార్చారు. ఈ మేరకు గుండెను చెన్నైలోని ఫోర్టిస్ ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని వైజాగ్‌లోని కేర్ ఆస్పత్రికి, మరో కిడ్నీని మణిపాల్ ఆస్పత్రిలో పేషెంట్‌కు, నేత్రాలను స్థానిక ఐ బ్యాంక్‌కు ఇచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement