ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు | arogyasri name changed to ntr vaidya seva | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు

Published Tue, Nov 18 2014 4:00 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు - Sakshi

ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదుగంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇసుక తవ్వకాలు, పింఛన్లు, గనుల లీజు అంశాలపై ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

కేబినెట్ నిర్ణయాలు
* ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటుకు ఆమోదం
* ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్య 938 నుంచి 1038కు పెంపు
* ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంపు
* గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల రద్దు
* మంగంపేటలో 250 హెక్లార్లలో గనుల లీజు రద్దు
* రాజధాని ప్రాంతంలోకి 29 గ్రామాలను తీసుకురావాలని నిర్ణయం
* అనంతపురం జిల్లా సజ్జలదిన్నెలో పవన విద్యుత్ ప్లాంట్ కు 35 ఎకరాల భూమి కేటాయింపు
* వ్యవసాయ రంగానికి ఇక్రిశాట్ ను అనుసంధానం చేయాలని నిర్ణయం
* ప్రతి కళాశాలలోనూ, ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి యూనిట్ల ఏర్పాటు
* బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల చెల్లించాలని నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement