విద్యా ఉపాధి అవకాశాలకు గండికొట్టే ఆర్టికల్ 371డీ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో వాగ్వాదానికి తెరతీశారుు.
అది రాజ్యాంగ విరుద్ధమన్న చెంగ ల్రాయుడు
ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉపాధి అవకాశాలకు గండికొట్టే ఆర్టికల్ 371డీ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాభిప్రాయానికి పూర్తిగా వ్యతిరేకమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు మండలిలో వాగ్వాదానికి తెరతీశారుు. అదే పార్టీకి చెందిన షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డిలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 371డీ రాజ్యాంగ విరుద్ధం అనే హక్కు చెంగల్రాయుడికి లేదని, ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పొంగులేటి, యాదవరెడ్డిలు కూడా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుపట్టారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ 371డీపై సభ్యులు అభిప్రాయాలు చెప్పవచ్చుగానీ, నిర్ణయాలు చెప్పే అధికారం వారికి లేదని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే విషయంలో పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తమ ఉద్యమమని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు.
టీడీపీ విభజనకు కట్టుబడి ఉందని, 2008లోనే చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ తెలిపారు.
లోపల అంతా విభజనకు ఒప్పుకుని బయట ఉల్టాగా మాట్లాడుతున్నారని, అందులో మా సీఎం కూడా ఒకరని షబ్బీర్ అలీ విమర్శించారు.
మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తోసిరాజని విభజన జరిగితే అది అప్రజాస్వామ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అన్నారు.
ఎన్నికలకు ముందు విభజన ప్రక్రియ జరుగుతుండటాన్ని బట్టి.. ఇది రాజకీయ లబ్ధి కోసమేనని అర్థమవుతోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.
కేవలం అభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ అడగడం లేదని, ఇది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని టీడీపీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి చెప్పారు.
రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు.
{పాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ కోరారు.