18 వరకే అంటున్న అధికార పక్షం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎప్పటితో ముగుస్తాయి? అందరూ భావిస్తున్నట్టు ఈ నెల 20తో ముగుస్తాయా? లేదా ఇంకేదైనా తిరకాసుకు అవకాశం ఉందా? విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ఎప్పుడు ఉంటుంది, ఎన్నిరోజుల పాటు చర్చిస్తారన్న అంశాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అరుుతే 18వ తేదీతోనే అసెంబ్లీ భేటీకి ముగింపు పలకనున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్ని పురస్కరించుకుని ఎజెండాను, ఎన్నిరోజులపాటు సమావేశాలు జరపాలో ఖరారు చేయడానికి 11వ తేదీన స్పీకర్ బీఏసీ భేటీ జరిపారు. అందులో వారం పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. వారంరోజులంటే వారం పని దినాలుగా(శని, ఆదివారాలు తీసివేయగా) లెక్కించి 20వ తేదీ వరకు జరుగుతాయని కొందరు మంత్రులు సూత్రీకరించగా, మరి కొందరు మాత్రం ఆ రెండు సెలవు దినాలతో కలిపే సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఆ లెక్కన 18వ తేదీతోనే అసెంబ్లీ ముగుస్తుందంటున్నారు.
బీఏసీలో కచ్చితంగా ఫలానా తేదీ వరకు అని నిర్ణయం జరగలేదని, 7 రోజులు జరపడానికే ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందంటున్నారు. 11న సాయంత్రం శాసనమండలి బీఏసీ కూడా జరిగిందని, దాంట్లో ప్రస్తుత సమావేశాలు 18వ తేదీవరకు జరపాలని నిర్ణయించా మని, అసెంబ్లీని 18 వరకే జరపాలని నిశ్చయించినందునే మండలి సమావేశాల్నీ ఆ రోజుతోనే ముగించాలని నిర్ణయించామని ఓ మంత్రి వివరణిచ్చారు. అలా 18తోనే అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఇలావుండగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని వివరించడానికి సీఎం కిరణ్ అఖిలపక్ష బృందాన్ని 19న ప్రధాని వద్దకు తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాలు 18తో ముగుస్తాయని ఆయనకు తెలుసు కాబట్టే 19న అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లేం దుకు నిర్ణరుుంచుకున్నారని మరో మంత్రి చెప్పారు.
శాసనసభ మరో రెండు రోజులేనా?
Published Mon, Dec 16 2013 1:03 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement