శాసనసభ ప్రొరోగ్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలను ప్రభుత్వం ప్రొరోగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ ఎనిమిదో సమావేశాలను, శాసనమండలి 27వ సమావేశాలను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదేశాల మేరకు ప్రొరోగ్ చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఇన్‌చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల పదోతేదీన అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డప్పటికీ గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ప్రొరోగ్ నోటిఫికేషన్ జారీ చేసేవరకూ సాంకేతికంగా వాయిదా పడ్డట్లు కాదు. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఆర్డినెన్సులు జారీ చేయడానికి వీలుకాదు. అందువల్లే ప్రభుత్వం అసెంబ్లీని, కౌన్సిల్‌ను ప్రొరోగ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.