అసెంబ్లీ ప్రొరోగ్
ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిని, శాసనసభను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 10న 2017–18 వార్షిక బడ్జెట్ సమావేశాలు (ఏడో సెషన్) మొదలవగా మార్చి 27 వరకు 13 రోజుల పాటు శాసనసభ నడిచింది.
మండలి 9 రోజుల పాటు సాగింది. తిరిగి ఏప్రిల్ 16న (ఏడో సెషన్ రెండో సమావేశం), ఏప్రిల్ 30న (ఏడో సెషన్ మూడో సమావేశం) రెండు ప్రత్యేక సమావేశాలు కూడా జరిగాయి. మూడు పర్యాయాలు సభ నిరవధికంగా వాయిదా పడగా.. మంగళవారం శాసన సభ, మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.