అటకెక్కిన ‘బాలామృతం’ | Balamrutham scheme in anganwadi centers | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘బాలామృతం’

Published Mon, Dec 29 2014 2:37 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

అటకెక్కిన ‘బాలామృతం’ - Sakshi

అటకెక్కిన ‘బాలామృతం’

రాష్ట్ర విభజనతో పౌడర్ దిగుమతికి గండి
సాక్షి, హైదరాబాద్: విభజన రాజకీయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ సంస్థలో కొనసాగే బాలల పౌష్టికాహారం పథకం ‘బాలామృతం’ కొండెక్కింది. ప్రతి నెలా దాదా పు ఇరవై మూడు లక్షల మందికి పైగా బాలలు, బాలింతలు, గర్భిణులకు బలవర్ధక ఆహారం పంపిణీకి బ్రేక్ పడింది. ఆరోగ్య భారతం కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ పథకం అటకెక్కి రెండు నెలలు కావస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆహారం తయారు చేసి పెట్టే ఏకైక కర్మాగారంగా హైదరాబాద్‌లో ఉన్న నాచారం ఏపీ ఫుడ్స్ (ప్రస్తుతం టీఎస్ ఫుడ్స్‌గా పేరు మార్పు) ఫ్యాక్టరీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫ్యాక్టరీగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం విముఖత చూపుతోందని, తాము ఆహారం పంపిణీ చేయబోమని సదరు ఫ్యాక్టరీ తేల్చిచెప్పినట్టు ప్రచారం వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా మంకుపట్టుతో పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడంతో అంగన్‌వాడీ బాలలకు సాదాసీదా ఆహారం కూడా లేకుండా పోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ పౌడర్ అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే పంపిణీ జరిగింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి విడిపోయినప్పటి నుంచి దాదాపు రూ. 95 కోట్లు బకాయి రూపంలో చెల్లించాల్సి ఉందని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. పదో షెడ్యూల్‌లో ఉన్నందున ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడాల్సిన పరిశ్రమకు దాదాపు రూ. 20 కోట్లు చెల్లింపులు జరిపామని, వీలు వెంబడి మిగిలింది ఇస్తామని ఏపీ అధికారులు చెప్తున్నారు. పౌష్టికాహారం దిగుమతి గురించి మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు.
 
ఆ విషయం నాకు తెలియదు: మంత్రి
ప్రభుత్వం అందించే బాలామృతం ఒక్కసారిగా ఆగిపోవడంతో ఏపీలో పేదబాలలు, బాలిం తలు ఉసూరుమంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు శనివారం సంక్షేమ విభాగాలపై సమీక్ష చేసినా ఈ అంశం చర్చకు రాలేదని, తనకైతే అసలు తెలియదని మంత్రి రావెల కిషోర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement