ఉత్సాహంగా బాల్‌బ్యాడ్మింటన్ | Ball badminton nationals | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బాల్‌బ్యాడ్మింటన్

Jan 13 2014 2:50 AM | Updated on Sep 2 2017 2:34 AM

ఉత్సాహంగా బాల్‌బ్యాడ్మింటన్

ఉత్సాహంగా బాల్‌బ్యాడ్మింటన్

జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి.

 ఖమ్మం స్పోర్ట్స్ , న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండోరోజైనా సోమవారం పురుషుల, మహిళల లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. పలు జట్ల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపర్చారు. ఈనెల 15 వరకూ ఈ పోటీలు జరగనున్నాయి. ఆర్గైనె జింగ్  సెక్రెట్రీ సురేష్, అబ్జల్ హసన్, బొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
 
 క్రీడాకారులకు అనుగుణంగా వంట ఏర్పాట్లు....
 సీనియర్ బాల్ బ్యాడ్మింటిన్ టోర్నీకి హాజరైన క్రీడాకారులకు నిత్యం ఆయా ప్రాంతాల ఆహార నియమాల ప్రకారం భోజన ఏర్పాట్లు చేసినట్లు మెస్ కమిటీ సభ్యులు యలమంచిలి సూర్యనారాయణ, దిరిశాల వెంకటేశ్వర్లు, కె.రత్నాకర్, బోప్పన సాయిబాబా తదితరులు పేర్కొన్నారు.
 
 నేడు క్యాంప్ ఫైర్...
 టోర్నీలో భాగంగా మూడో రోజైన సోమవారం సాయంత్రం క్యాంప్‌ఫైర్,మ్యూజికల్‌నైట్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా బాల్ బాడ్మింటన్ కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు తెలిపారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు నిర్వహించే కార్యక్రమాలలో క్రీడాకారులు విధిగా హాజరుకావాలని తెలిపారు. నగరంలోని క్రీడాభిమానులు అదిక సంఖ్యలో పాల్గొని క్యాంప్‌ఫైర్‌ను విజయవంతం చేయాలని కొరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement