చిత్తూరు (అగ్రికల్చర్): స్వయం సహా యక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాం చ్‌లెస్ బ్యాంకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలను ‘వన్ స్టాప్ షాప్’ పేరుతో ఆయా గ్రామాలకు చెందిన ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కేంద్రాల కార్యకలాపాలను వరల్డ్ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ కింద స్త్రీనిధి బ్యాంకు ఆధీనంలో బ్రాంచ్‌లెస్ బ్యాంకింగ్‌గా నడుపనున్నారు.
జిల్లాలో మొదటి విడతగా 12 మండలాల్లో ఏర్పాటుకు చర్యలుతీసుకోవాలని సెర్ఫ్‌నుంచి డీఆర్‌డీఏ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. వన్‌స్టాప్ షాప్‌లద్వారా బ్యాంకు లావాదేవీలు, ఇన్సూరెన్స్, ఉపాధికూలీల పేమెంట్ , సా మాజిక పింఛన్లపంపిణీ తదితరసేవలను నిర్వహిస్తారు.
కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వన్ స్టాప్ షాప్‌లను పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు డీఆర్‌డీఏ, స్త్రీనిధి అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. జనాభా ప్రాతికపదికన 1500 మందికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాలను పూర్తిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు కస్టమర్ సర్వీస్ కమిటీల సభ్యులుగా మహిళలను నియమిస్తారు. ఆయా గ్రామ సమాఖ్యలు కస్టమర్ సర్వీస్ పాయింట్లుగా, సంఘాల్లోని మహిళలు విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రైజర్‌లుగా కేంద్రాలను నిర్వహించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. అనువైన ప్రదేశాలను గుర్తించి జనవరి రెండో వారంలో సెర్ఫ్ అధికారులకు పంపించనున్నారు.
మొదటి విడత ఏర్పాటుచేయనున్న మండలాలు ఇవే
వన్ స్టాప్ షాప్‌ల పేరుతో నిర్వహించనున్న బ్రాంచిలెస్ బ్యాంకింగ్ సేవల కేంద్రాలను మొదటి విడతగా తవణంపల్లి, బంగారుపాళ్యం, బెరైడ్డిపల్లి, చౌడేపల్లి, పెద్దమండ్యం, తంబళ్లపల్లి, బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, చిన్నగొట్టిగల్లు, కేవీ పల్లి, ములకలచెరువు, ఎర్రావారిపాళెం మండలాల్లో ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి.
బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడానికి..
గ్రామీణ ప్రాంతంలోని సంఘాల మహిళలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయాలనే తలంపుతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా సంఘాల్లోని మహిళలకే కాకుండా సామాజిక పింఛనుదారులు, ఉపాధి కూలీలకు పేమెంట్‌లు, వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ల జారీ తదితర ప్రభుత్వ సేవలు కూడా అనుసంధానం చేయనున్నాం. మొదటి విడతగా 12 మండలాల్లో అనువైన ప్రదేశాల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేసి జాబితాలను సెర్ఫ్‌కు పంపిస్తాం.
-జి.వెంకటప్రకాష్,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్త్రీనిధి బ్యాంక్
బ్యాంకింగ్ @ ‘స్వయం’ సంఘాలు
Published Wed, Dec 31 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement
Advertisement