
సాక్షి, విజయవాడ : విధుల్ని పక్కన పెట్టి బెటాలియన్ పోలీసులు బరితెగించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఉన్న అకామిడేషన్ కేంద్రంలో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. స్టేషన్‌లోనే ఉన్న బ్యారక్‌లో నిత్యం పేకాటాడుతూ, మద్యం తాగి వివాదాల్లో నిలవడం పరిపాటి అయ్యింది. ఆరెస్సై శ్రీనివాసరావు సమక్షంలోనే సహచర కానిస్టేబుళ్లు పేకాడుతుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది.
గార్డు విధులను, తమ ఆయుధాలను పక్కనపడేసి పేకాటడుతున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలల క్రితం బెజవాడ బస్టాండ్‌లో యువతిని వేధించిన కేసులో ఒకరు, తిరుమలలో మద్యం తాగి విధులు నిర్వహించడంలో మరొకరు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇలా వరుస వివాదాల్లో వెంకటగిరి బెటాలియన్ నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment