అనంతపురం ఎడ్యుకేషన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహి అని రైతులు, డ్వాక్రా మహిళలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. రుణమాఫీపై రాష్ర్ట ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చేపట్టిన ‘నరకాసుర వధ’ శనివారం ముగిసింది. జిల్లాలో పలుచోట్ల రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొని సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల సమయంలో రైతుల అన్ని రకాల రుణాలూ మాఫీ చేస్తానని, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలు కూడా రద్దు చేస్తానని ఇచ్చిన హామీని నేడు గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సీఎం చంద్రబాబు ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి.. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భారతి, వైస్ ఎంపీపీ అనంతమ్మ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
కదరి నియోజకవర్గంలోని తలుపులలో కదిరి-పులివెందుల రహదారిపై రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జ్యోతిర్మయి, పార్టీ మండల కన్వీనర్ శంకర పాల్గొన్నారు. నంబులపూలకుంటలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాండ్లపెంటలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ జెడ్పీటీసీ భాస్కరరెడ్డి, మాజీ ఎంపీటీసీ హైదర్‌వలి, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుట్టపర్తి నియోజవర్గ పరిధిలోని నల్లమాడలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు పొరకల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త కొత్తకోట సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రంగలాల్ నాయక్, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లు బస్టాండు వద్ద వుుఖ్యవుంత్రి చంద్రబాబు దిష్టి బొవ్మును దహనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సింగాడితిప్పయ్యు, వుండల కన్వీనర్ దేశాయ్ చంద్రనాథ్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బి.సుంకన్న పాల్గొన్నారు.
హిందూపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా అంబ్కేర్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడ చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి (చంటి), కౌన్సిలర్ నాగభూషణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శింగనమలలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆలూరి సాంబశివారెడ్డి, మండల కన్వీనరు చెన్నకేశవులు, పార్టీ నేత శ్రీరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండు సర్కిల్‌లో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
నమ్మకద్రోహం
Published Sun, Jul 27 2014 2:18 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement