విభజన బాధాకరమే.. తప్పలేదు: జైరాం రమేష్
రాష్ట్ర విభజన బాధాకరమే గానీ, అయినా తప్పలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రలోని యువకులు ధైర్యంగానే ఉన్నారని, వృద్ధులు, మేధావులే బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల తర్వాత కాంగ్రెస్ చివర్లో విభజన అనే మందును మింగిందని ఆయన అన్నారు.
కృష్ణా జలాల కమిటీ ఛైర్మన్‌ను కేంద్రమే నియమిస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. సీమాంధ్రలో వచ్చే ఐదేళ్లలో కొత్త విద్యాసంస్థలు, యూనివర్సీటీలను ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర రాజధానిపై సెప్టెంబర్ లోగా కమిటీ నివేదిక ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.