హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ బెటాలియన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది.
హైదరాబాద్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్ట సీఆర్పీఎఫ్ బెటాలియన్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కానిస్టేబుల్ దుర్గప్రసాద్ 40 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సీఆర్పీఎఫ్ ఎస్ఐ అమృత లింగం చాంద్రయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెన్షనర్లకు చెల్లించాల్సిన డబ్బులను దుర్గప్రసాద్ తన భార్య శారద అకౌంట్లోకి మళ్లించినట్లు తెలుస్తోంది. దుర్గా ప్రసాద్‌తో కుమ్మక్కైన వారి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వాహా చేసిన డబ్బులతో దుర్గా ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.