కరోనాపై విజయం సాధిద్దాం | Biswabhusan Harichandan Comments On Janata Curfew | Sakshi
Sakshi News home page

కరోనాపై విజయం సాధిద్దాం

Published Sat, Mar 21 2020 4:30 AM | Last Updated on Sat, Mar 21 2020 4:30 AM

Biswabhusan Harichandan Comments On Janata Curfew - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన విధంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటించాలని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

- ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాల్లోనే ఉండాలి.
- అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలి. 
- పరిశుభ్రత, సామాజిక దూరం ఆవశ్యకతను గుర్తించి అనుసరించాలి. 
- కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకుండా కాల్‌ సెంటర్‌ను సంప్రదించి వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలి. 
- కరోనాను అరికట్టేందుకు రాజ్‌భవన్‌ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నామని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు చెందిన వారికి మినహా ఇతరుల ప్రవేశంపై ఆంక్షలు విధించినట్టు గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. 
- రాజ్‌ భవన్‌ అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, ముసుగులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 
- గవర్నర్‌ సైతం నెలాఖరు వరకు తన పర్యటనలు రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement