యూటర్న్ వార్తలు ఊహాగానాలే: కేసీఆర్ | BJP did not take support back on Telangana, says KCR | Sakshi
Sakshi News home page

యూటర్న్ వార్తలు ఊహాగానాలే: కేసీఆర్

Published Mon, Feb 3 2014 5:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

యూటర్న్ వార్తలు ఊహాగానాలే: కేసీఆర్ - Sakshi

యూటర్న్ వార్తలు ఊహాగానాలే: కేసీఆర్

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మా పార్టీ మొదట్నుంచి మద్దతు తెలుపుతుందని రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు కూడగట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ నాయకులతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆర్ ఎల్ డీ నేత అజిత్ సింగ్ తో సమావేశమయ్యారు.
 
ఈ భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణకు జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఉంటుంది అని అన్నారు.  'ఎన్నికల సమయంలో తెలంగాణపై ఎవరూ వెనక్కు వెళ్లరు. తెలంగాణపై ఎవరైనా వెనక్కి వెళితే వారికే నష్టం' అని అజిత్‌సింగ్‌ అన్నారు. 
 
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ యూటర్న్ తీసుకుంటుందని వస్తున్న వార్తలన్ని ఊహాగానాలే అని అన్నారు.  ఈ దశలో బీజేపీ వెనక్కు తగ్గుతుందని అనుకోను అని  కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లు కచ్చితంగా పాస్‌ అవుతుంది అని కేసీఆర్‌ విశ్వాసం ప్రకటించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement