‘మంత్రులంతా డమ్మీలుగా మారారు’ | BJP leader somu veerraju visit kurnool government hospital | Sakshi
Sakshi News home page

భయంకరమైన అవినీతి జరుగుతోంది..

Published Fri, Mar 30 2018 1:12 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

BJP leader somu veerraju visit kurnool government hospital - Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భయంకరమైన అవినీతి జరుగుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బొర్డులో పనిచేస్తున్నట్లు నమోదైంది.

టీబీఎస్‌ సంస్థ పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్‌కు ఎక్కడా లేని విదంగా రూ.103 కోటట్లు మొబిలైజేషన్‌ ద్వారా, బిల్లుల రూపేనా రూ. 45 కోట్లు చెల్లించారు. సదరు సంస్థ ఓ మంత్రి గారి బంధువుది కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. టీబీఎస్‌ కాంట్రాక్టు రద్దు చేయాలి. టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ఆర్‌జీఎస్‌లో అవినీతిని బహిరంగపరుస్తాం’ అని సోము వీర్రాజు వెల్లడించారు.

తండ్రీకొడుకుదే పాలన

రాష్ట్రంలో తండ్రీకొడుకులు పాలన చేస్తున్నారని, మంత్రులంతా డమ్మీలుగా మారారని విమర్శించారు. కేఈ, చిన్నరాజప్పలు కేవలం పేరుకే ఉప ముఖ్యమంత్రలని, వారికి ఎలాంటి అధికారాల్లేవన్నారు. సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.

ప్యాకేజీపై ప్రధానిని గతంలో చంద్రబాబు అభినందించి, ఇపుడు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారని, సోనియాతో గాంధీతో ఎందుకు రహస్య మంతనాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement