
భూ కుంభకోణాలపై చర్చ జరపాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం లేఖ రాశారు.
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రూ.వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా సీబీఐ విచారణ కోరినప్పుడు ఇక ఇబ్బందేముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో విశాఖలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిస్తే, ఆ పార్టీ వారు ఇక్కడ మకాం వేస్తారని, ఇక్కడి భూములు ఆక్రమించుకుంటారని చేసిన ప్రచారమే తమ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమని సోము వీర్రాజు అన్నారు. అప్పుడు ఎన్నికల్లో అలా ప్రచారం చేసినవారే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.