
సమైక్యంగా ఉంచమని చెప్పలేదు: కంభంపాటి
విశాఖపట్టణం: రాష్ట్ర విభజనకు మొదటి నుంచి తమ పార్టీ అనుకూలమని బీజేపీ సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. బీజేపీ విధానం తెలంగాణే అని స్పష్టం చేశారు. ఏనాడు బీజేపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని చెప్పలేదని అన్నారు. కొందరు నేతల ప్రయత్నాల వల్ల సీమాంధ్ర ప్రజలకు నిరాశ కలిగిందన్నారు. బీజేపీ ఏనాడు తన విధాన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదని గుర్తు చేశారు.
మార్చి 1న విశాఖలో పీఎం ఫర్ మోడీ కార్యక్రమం జరుగుతుందని, దీనికి జాతీయ నేత వెంకయ్య నాయుడు హాజరు కానున్నారని చెప్పారు. మార్చి 20 నుంచి ఏప్రిల్ 10లోగా సీమాంధ్రలో నాలుగుచోట్ల మోడీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.