కొందరికి లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక రాజధాని!
విశాఖపట్నం: తాత్కాలిక రాజధానిగా విజయవాడ ఏర్పాటుపై మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు. టీడీపీలోని కొందరు వ్యక్తులకు ఆర్ధిక లాభం చేకూర్చడానికే తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ తాత్కాలిక రాజధాని ఉండగా మరో తాత్కాలిక రాజధాని ఎందుకు అని బొత్స ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని బొత్స అన్నారు.