కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు | Botsa Satyanarayana Slams TDP Over Grama Volunteer | Sakshi
Sakshi News home page

కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు: బొత్స

Published Thu, Aug 15 2019 2:56 PM | Last Updated on Thu, Aug 15 2019 3:02 PM

Botsa Satyanarayana Slams TDP Over Grama Volunteer - Sakshi

సాక్షి, కర్నూలు: కష్టపడి పని చేసేవారికి మంచి రోజులు వస్తాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామ వలంటీర్లు వారధిగా ఉండాలన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలన్నింటిని ప్రజలకు అందించాలని తెలిపారు.

అమ్మ ఒడి, పెన్షన్‌ వంటి వాటిని ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు బొత్స. వలంటీర్ల నియమాకలపై టీడీపీ నేతలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా విమర్శలు చేయడం మంచిది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement