అప్పుడు 2020.. ఇప్పుడు 2050... | Botsha satya narayana slams TDP govt on AP budget | Sakshi
Sakshi News home page

అప్పుడు 2020.. ఇప్పుడు 2050...

Published Thu, Mar 12 2015 7:47 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

అప్పుడు 2020.. ఇప్పుడు 2050... - Sakshi

అప్పుడు 2020.. ఇప్పుడు 2050...

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారడీలా ఉందని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.  అంకెలగారడీ బడ్జెట్తో ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. గురువారం బొత్స విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టలేని చవటలు, దద్దమ్మలా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు.

అయితే విజన్-2020 అన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజన్-2050 అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి, దోపిడీ అజెండాగా పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement