
తిరుమల ఘాట్‌రోడ్డులో బస్సు ప్రమాదం
తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డులో బుధవారం మధ్యాహ్నం బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులోని 32వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈఘటనతో ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.