రాయలసీమలో రాజధాని | capital In Rayalaseema | Sakshi
Sakshi News home page

రాయలసీమలో రాజధాని

Published Fri, Jan 15 2016 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

capital In Rayalaseema

సీమ అభివృద్ధిపై చర్చలో పలువురు మేధావులు, విద్యావంతుల డిమాండ్
 

రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమని పలువురు మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో సోమవారం రాయలసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధిపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ప్రభుత్వం రాయలసీమను తీవ్ర నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే రాజధానిని నిర్మించాలని, అయితే ప్రస్తుత పాలకులు దాన్ని ఉల్లంఘించారని ధ్వజమెత్తారు.
 
రాయలసీమలో రాజధాని ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని పలువురు మేధావులు, నాయకులు అభిప్రాయపడ్డారు. విభజన తరువాత పాలకుల పక్షపాత ధోరణితో సీమకు అన్యాయం జరిగిందన్నారు. తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సోమవారం రాయలసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధిపై  చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, నాయకులు పాల్గొని, తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఎవరేమన్నారంటే...  
 - తిరుపతి సిటీ
 
శ్రీబాగ్ ఒడంబడిక ఉల్లంఘన
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే రా జధాని నిర్మాణం చేయాలి. అయితే దాన్ని ఉల్లంఘిం చా రు. 14, 15 దశాబ్దాల్లో విదేశీ యాత్రికులు రాయలసీమ ను రతనాల సీమగా కీర్తించారు. అయితే నేడు ఈ ప్రాం తంలో రాళ్ల సీమగా మారింది.ఎక్కడ చూసినా కరువు కరాళనృత్యం చేస్తోంది. ఈ దుర్భిక్షం పోవాలంటే సీమ జిల్లాలకు 750 టీఎంసీల నీళ్లు అవసరం. నీటి సమ స్య పరిష్కారం కావాలంటే నికల జలాల పంపిణీ జరగాలి.   - ఎ.హనుమంత్‌రెడ్డి,  రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు
 
ఓట్టు వేయలేదని సీమకు అన్యాయం
అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉండదని సిటిజన్ ఫోరమ్ ఆధ్వర్యంలో మేమంతా సీఎం చంద్రబాబును కలిసి విన్నవించినా లెక్కచేయలేదు.          రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని సీమకు అన్యాయం చేశారు. అయితే అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థులు గెలవడం తో అక్కడ  కొంత వరకు అభివృద్ధి పనులు చేస్తానని సీఎం చెప్పారు. నెల్లూరు జిల్లాకు మంజూరైన పరిశ్రమలను చాలావరకు కోస్తాంధ్రకు తీసుకెళుతున్నారు.
 - అంజనేయ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి
 
రాయలసీమలో బస్సుయాత్ర
రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నాం. అనంతపురం జిల్లాలో లక్షా 25 వేల ఎకరాల భూమిని రైతులు సాగుచేసుకుంటుండగా ప్రభుత్వం లాక్కుంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా పేదల నుంచి భూములు లాక్కున్నారు. సుమారు 200 మంది రైతులు ఒక అనంతపురం జిల్లాలోనే అత్మహత్యలు చేసుకున్నారు. మనమంతా దొంగల ప్రభుత్వంలో ఉన్నాం.  
 -మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
 
నిధులు వెనక్కి పంపారు
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సాగునీరు, తాగునీరు, పరిశ్రమల కోసం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.7 వేల కోట్ల నిధులను జిల్లాకు తీసుకువస్తే సీఎం చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి, ఆ పథకాన్ని రద్దు చేసి,నిధులు వెనక్కి పంపారు..ఎంతవరకు సమంజసం. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలలో సీమ విద్యార్థులకు రావాల్సిన మెడికల్ సీట్లును 120 జీవో పేరుతో రద్దు చేయడం సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనైతిక చర్య. - నవీన్‌కుమార్‌రెడ్డి,   రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
 
బాబు సీమను నిర్లక్ష్యం చేస్తున్నారు
సీఎం చంద్రబాబు రాయలసీమ జిల్లాలను అన్నీ విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోస్తాంధ్రాకు సీఎం దాసోహం అయ్యారు. కోస్తాంధ్రలో గెలుపొందితే చాలనే ధీ మాతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీమపై నిర్లక్ష్యం చూపి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పిలుపునిచ్చారు.                               -భూమన్, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం
సీమను ప్రత్యేకరాష్ట్రం చేయాలని ఉద్యమిస్తాం. ఈ ప్రాం తానికి మంచి జరిగే పరిణామం అసన్నమైంది. ఈ ప్రాం త నాయకులు అధికారంలో ఉన్నపుడు సీమ గురించి మాట్లాడరని, లేనపుడే మాట్లాడుతారు.  ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు ఒక ఛానల్, ప్రింట్ మీడియా, సాంస్కృతిక విభాగం ఏర్పడాలి. -బెరైడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
 
కోస్తాంధ్రతో కలిసి బతికితే నయవంచనే

సీమ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడితే తప్పా మన బతుకులు మారవు. కోస్తాంధ్రతో కలిసి బతికితే నయవంచనకు గురికాక తప్పదు. సీమ ప్రత్యేక రాష్ర్టం అనే డిమాండ్‌తో మనమంతా ముందుకు వెళ్లాలి. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి.    -గఫూర్, మాజీ ఎమ్మెల్సీ
 
తుళ్లూరులో రాజధాని రాదు

ఎట్టి పరిస్థితుల్లోనూ తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణం జరగదు. తిరిగి రాయలసీమలోనే ఏర్పాటు అవుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పటి నుంచి అన్నీ అపశకునాలే చోటు చేసుకుంటున్నాయి.
 - చింతా మోహన్, మాజీ ఎంపీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement