విశాఖ రూరల్: ఆధార్ అనుసంధానంతో జిల్లా 30 నుంచి 40 శాతం వరకు తెల్లరేషన్ కార్డులు రద్దవుతాయని అధికారులు లెక్కలు వేసుకున్నా రు. అనుసంధాన ప్రక్రియ 93.55 శాతం జరిగిపోయింది. రూరల్‌లో 91.36 శాతం, అర్బన్‌లో 97.29 శాతం కార్డులకు ఆధార్ సీడింగ్ జరి గింది. ఇప్పటికీ కొంత మంది ఆధార్‌కార్డులను అధికారులకు అందజేస్తూనే ఉన్నారు. అయినా జిల్లా జనాభాకు సమానంగా కార్డుల్లో సభ్యుల సంఖ్య ఉండడం ఇప్పుడు విస్మయపరుస్తున్న అంశం. బోగస్‌కార్డులు ఉన్నాయో? బోగస్ ఆధార్‌కార్డులు ఉన్నాయో? జనాభా గణాంకాలు తప్పో? ఎవరికీ అంతుచిక్కడం లేదు.
ఇదెలా సాధ్యం? : 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 42,88,113 లక్షలు జనాభా ఉంది. ప్రస్తుతం 45 లక్షలకు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నా రు. కుటుంబానికి నలుగురు చొప్పున లెక్కేసినా జిల్లాలో 11.25 లక్షల కుటుంబాలు మాత్రమే ఉండా ల్సి ఉంది. 2009 అధికారుల లెక్కల ప్రకారం 8.5 లక్షల కుటుంబాలు ఉం డగా ప్రస్తుతం 11.5 లక్షల వరకు పెరిగినట్లు అధికారులు చెబుతున్నా రు. ఈ కుటుంబాల సంఖ్యకు సమానంగా జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య ఉండడం గమనార్హం.
ఇదీ లెక్క... : జిల్లాలో 12,34,104 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో కొద్ది నెలలుగా బియ్యం విడిపించుకోని కార్డులను తొలగించగా 11,08,251 కార్డులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇందులో రూరల్ పరిధిలో 7,36,517, నగరంలో 3,72,004 కార్డుదారులు ఉన్నారు. ఈ 11.08 లక్షల కార్డుల్లో 39,26,950 మంది సభ్యులు ఉన్నా రు. దీని ప్రకారం చూస్తే జిల్లాలో కేవలం 6 లక్షల మంది అంటే కుటుం బాల పరంగా చూస్తే 1.5 లక్షల కుటుంబాలకు మాత్రమే తెల్లరేషన్‌కార్డులు లేనట్లు తెలుస్తోంది.
వీటి కోసం రచ్చబండ-3లో మరో 60 వేల మంది దరఖాస్తు చేసుకోగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. వీరికీ కార్డులిస్తే జిల్లాలో కేవలం 90 వేల కుటుంబాలకు మాత్ర మే కార్డులు లేనట్లు లెక్క. ఇప్పటికీ దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉం టే కుటుంబాల సంఖ్య కంటే కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించిన గత ప్రభుత్వం రెండేళ్లలో రెండుసార్లు బోగస్ కార్డుల ఏరివేతలో మొత్తం 77 వేల కార్డులను రద్దు చేసింది.
వాస్తవాని కి జిల్లాలో ధనికులు, ఇతరత్రా కారణాల వల్ల తెల్లరేషన్‌కార్డులు తీసుకోకుం డా 35 నుంచి 40 శాతం కుటుం బాలు ఉన్నట్లు అంచనా. మరి ఇంత సంఖ్యలో తెల్లకార్డులు ఎలా ఉన్నాయో అర్థంకాని విషయం. సీడింగ్‌లో తప్పు జరిగిందో.. లేదా జనాభా గణాంకాల్లో వ్యత్యాసముందో ఆ దెవుడికే ఎరుక.
కార్డు లెక్కలు దేవుడికే ఎరుక!
Published Tue, Sep 16 2014 12:40 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM
Advertisement
Advertisement