న్యూఢిల్లీ: ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 25 వరకు తెలంగాణలో 1,385, ఏపీలో 88 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా తెలిపారు. స్వైన్ ఫ్లూ కేసులపై రాజ్యసభ సభ్యులు టి.దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా గుజరాత్లో 3,769 కేసులు నమోదయ్యాయని వివరించారు.