పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ మస్సూద్ అహ్మద్
కేంద్ర నిపుణుల కమిటీ అసహనం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరుపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజినీర్ మస్సూద్ అహ్మద్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివ్వెరపోయింది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కనీసం కార్యాచరణ ప్రణాళిక(వర్కింగ్ షెడ్యూల్) కూడా రూపొందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హెడ్ వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ పనితీరుపై నోరెళ్లబెట్టిన కమిటీ.. పనులన్నీ ఏకపక్షంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
సబ్ కాంట్రాక్టర్ల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. 2014–15 నుంచి 2016–17 వరకూ కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఆరా తీసింది. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులనూ నిశితంగా పరిశీలించిన కమిటీ.. నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.