అట్లూరు: కుంభగిరి పంచాయతీ ఎస్. వెంకటాపురం మల్లినేనిపట్నం కాలనీకి చెందిన వరికుంట తిరుపయ్య(45) భార్య యల్లమ్మతో కలిసి కూలిపనులు చేసుకుని జీవించేవాడు.
కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించలేక పొలాలను కౌలుకు తీసుకుంటే.. అందులోనూ కష్టాలే ఎదురయ్యాయి. పంట చేతికందక.. చేసిన అప్పులు తీర్చలేక.. పెళ్లీడుకొచ్చిన బిడ్డ పెళ్లి చేయలేమోననే వేదనతో చివరకు ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అట్లూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది.
అట్లూరు:
కుంభగిరి పంచాయతీ ఎస్. వెంకటాపురం మల్లినేనిపట్నం కాలనీకి చెందిన వరికుంట తిరుపయ్య(45) భార్య యల్లమ్మతో కలిసి కూలిపనులు చేసుకుని జీవించేవాడు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. కూలిపనులు చేసి కుమార్తెకు పెళ్లి చేయలేననుకున్నాడు. సొంతపొలం లేకపోయినా కౌలుకు తీసుకుని పంటలు పండించి వచ్చిన ఆదాయంతో కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాడు. అప్పులు చేసి పైర్లు పెట్టుకున్నాడు.
పెట్టిన పైర్లు చేతికిరాలేదు. చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. ఇక కూతురి పెళ్లి చేయలేననుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తీసుకుని శుక్రవారం రాత్రి కాలనీ శివారుకు వెళ్లి తాగి పడిపోయాడు. గమనించిన కాలనీవాసులు వెంటనే ప్రైవేటు వాహనంలో బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుపయ్య ఆస్పతికి వెళ్లేసరికే కన్నుమూశాడు. శనివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
అప్పులు ఎలా తీర్చాలయ్యా..
చేసిన అప్పులు ఎలా తీర్చాలి. కూతురి పెళ్లి ఎలాచేయాలి. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయావా.. అయ్యా..అంటూ మృతుని భార్య యల్లమ్మ బోరున విలపిస్తుంటే కంటతడి పెట్ట ని వారు లే రు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆ దుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.