
సమ్మె విరమణ వెనుక కథేంటి?: చలసాని
సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చిత్తశుద్ధితో సమ్మె చేస్తుంటే వారి నాయకుడు అర్థాంతరంగా విరమించాలని చెప్పడం వెనుక అంతరార్థమేంటని ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు.
గుంటూరు: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చిత్తశుద్ధితో సమ్మె చేస్తుంటే వారి నాయకుడు అర్థాంతరంగా విరమించాలని చెప్పడం వెనుక అంతరార్థమేంటని ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మరో ఎనిమిది గంటలపాటు సమ్మె జరిపి ఉంటే కేంద్రం దిగి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆంధ్ర మేధావుల, విద్యావంతుల వేదికలో పాల్గొన్న ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
ఉద్యోగులు సమ్మె విరమించడానికి అశోక్‌బాబుకి దిగ్విజయ్‌సింగ్ ఏమైనా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు. ఎవరు చెబితే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నిలిపివేయాల్సి వచ్చిందని నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానం విభజనను అడ్డుకునే అవకాశాలున్నాయని, అయితే విభజనపై కేంద్రప్రభుత్వాన్ని చాలాకాలం క్రితమే న్యాయస్థానం వివరణ ఇవ్వమన్నప్పటికీ ఇంతవరకూ ఇవ్వలేదన్నారు.