కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత అయిన వ్యక్తికి మంత్రిపదవి అప్పగించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ రాష్ట్రంలో అన్ని నగరాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు గానీ, సొంత ఊరైన నెల్లూరు గురించి, ఈ నగర అభివృద్ధి గురించి మాత్రం ఏమీ మాట్లాడటంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
కార్పొరేట్ విద్యాసంస్థల అధినేత అయిన వ్యక్తికి మంత్రిపదవి అప్పగించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. నెల్లూరులో ఇంకా చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ నగరాన్ని మంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.