రుణమాఫీ వంచనపై రణదుందుభి
కాకినాడ :రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసగించిన చంద్రబాబు సర్కారుపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వచ్చే నెల 5న మండల కేంద్రాల్లో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి రైతులు, మహిళలను పెద్ద ఎత్తున సమీకరించాలన్నారు. ఇక్కడి గొడారిగుంటలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కార్యాలయంలో బుధవారం పార్టీ జిల్లా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అధ్యక్షత వహించిన జ్యోతుల మాట్లాడుతూ రైతులు, మహిళా సంఘాలకు ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసి, తక్షణమే రుణాలు రద్దు చేయాలనే డిమాండ్‌తో చేపట్టే ఆందోళన కార్యక్రమాలను నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేయాలన్నారు. వెన్నుదన్నుగా నిలిచి ఉద్యమించాలన్నారు.
త్వరలో పార్టీ కమిటీల నియామకాలు
పార్టీ జిల్లా కమిటీ, అనుబంధ విభాగాల కమిటీలకు పనితీరు ఆధారంగా నేతల పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. 10 రోజుల్లో ప్రతి నియోజకవర్గానికీ 36 పేర్ల చొప్పున జిల్లా కమిటీకి అందచేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని జిల్లా కమిటీలో, మరొకరిని అనుబంధ సంఘాల్లో నియమిస్తామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 120 చొప్పున పేర్లను ఎంపిక చేసి పంపాలన్నారు. అంకితభావంతో పనిచేసే వారినే సిఫార్సు చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, సీఈసీ సభ్యులు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు,
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అల్లూరు కృష్ణంరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొల్లి నిర్మల కుమారి, జక్కంపూడి రాజా, గుండా వెంకటరమణ, నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, తోట నాయుడు, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, సీఈసీ సభ్యుడు రెడ్డి సత్యవరప్రసాద్, అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, కాకినాడసిటీ అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, నేతలు కొవ్వూరి త్రినాథరెడ్డి, అత్తిలి సీతారామస్వామి, విప్పర్తి వేణుగోపాలరావు, కుచ్చర్లపాటి సూర్యనారాయణరాజు, సత్తి వీర్రెడ్డి, వేగుళ్ల పట్టాభి రామయ్యచౌదరి, కురుమళ్ల రాంబాబు, మాకినీడి గాంధీ, ఎ.సుదర్శన్, అల్లి రాజబాబు పాల్గొన్నారు.