మరోసారి దగా! | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

మరోసారి దగా!

Published Fri, Dec 5 2014 1:48 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

మరోసారి దగా! - Sakshi

మరోసారి దగా!

 విజయనగరం అర్బన్/కంటోన్మెంట్ : టీడీపీ ప్రభుత్వం రైతులను మరోసారి దగా చేసింది. ఇప్పటికే రుణమాఫీ అమలులో రోజుకో విధంగా ప్రకటనలు చేస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... గురువారం చేసిన ప్రకటన వారిని మరింత విస్మయానికి గురి చేసింది. ము ఖ్యమంత్రి ప్రకటన ప్రకారం జిల్లాలోని రైతులకు కనీసం 40 శాతం కూడా మాఫీ లభించేపరిస్థితి లేదు. మరోవైపు అర్హులైన జాబితాలను నేరుగా బ్యాంకులకు పంపి దాన్ని రహస్యంగా అధికార పార్టీ నేతల చేతిలో పెట్టడం వల్ల రైతులు రాజకీయ కక్ష సాధింపులు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే తొలి విడత అర్హుల జాబితాలో రూ. 50 వేల రూపాయల రుణమాఫీ పరిధిలో ఎంతమంది ఉన్నారన్నది ఆయా బ్యాం కు అధికారులు చెప్పలేకపోతున్నారు. తాజాగా నిధులు విడుదల చేస్తామన్న అర్హుల జాబితా గాని, వాళ్ల రుణం మొ త్తంగాని బ్యాంకర్లకు తెలియజేయకుండా టీడీపీ నాయకులు జాగ్రత్త పడుతున్నారు. కనీసం బ్యాంకుల రీజనల్ కార్యాలయాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో మాఫీ నిధులు రైతు ఖాతాలో జమ అయ్యే వరకు బ్యాంకర్లకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
 
 40 వేల మందికే తొలి విడత అర్హత
 జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో అప్‌లోడ్ చేసిన 2.78 లక్షల రైతుల్లో తొలి విడత అర్హత లభించిన వారు కేవలం 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. జిల్లాలో అధికంగా రైతులు వినియోగించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీ ణ వికాస్ బ్యాంకు, డీసీసీబీ, ఎస్‌బీఐ బ్యాంకులలో అర్హుల జాబితాను సంబంధిత రీజనల్ కార్యాలయాల్లో ప్రకటిం చారు. ఏపీజీవీబీ ద్వారా అప్‌లోడ్ చేసిన 64,124 మందిలో తొలి విడత 38,040 మందికి, డీసీసీబీలో 84,091 మందికి 34,181 మంది అర్హులు ఉన్నారు. ఇంకా జిల్లాలోని వివిధ బ్యాంకల తొలి విడత జాబితా లీడ్ బ్యాంకులకు చేరాల్సి ఉంది. ఈ జాబితాను క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలకు పంపి, తుది అర్హత జాబితా తెలియజేస్తారు.
 
 రూ. 400 కోట్ల బంగారు రుణాల మాఫీ వట్టిదేనా?
 జిల్లావ్యాప్తంగా 4. 60 లక్షల మంది రైతులుండగా అందులో 3.20 లక్షల మంది రూ.1400 కోట్ల రుణాలు తీసుకున్నారు.ఇందులో దీర్ఘకాలిక రుణాలు, అనుబంధ రుణాలు తీసి వేస్తే రూ.1,157 కోట్ల రుణాలు తీసుకున్నట్టు అధికారులు అంచనా వేసి లెక్కగట్టారు. ఇందులో రూ. 430 కోట్లు బంగారం రుణాలు కాగా, పంట రుణాలు రూ. 727 కోట్లు. ప్రస్తుతం ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి ఇందులో రూ. 430 కోట్ల మా ఫీ మాటే లేదు. బంగారం రుణాలు తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారన్న లెక్క కూడా ఇంకా లీడ్‌బ్యాం కుకు రాలేదని బ్యాంకర్లే చెబుతున్నారు. అసలు బంగారు రుణాల ఊసే ఎత్తడం లేదని ఆయా వర్గాలకు చెందిన రైతు లు ఆవేదన చెందుతున్నారు. రుణాలు మాఫీ అవుతా  య న్న అర్హుల జాబితాలు బ్యాంకు శాఖలకు పంపించడం, వారి ఆధార్, ఓటరు కార్డులు సేకరించాలని చెప్పడంతో ఇంకా మాఫీ మొత్తం ఎం తన్నది ఇదమిద్థంగా తెలియడం లేదు.
 
 అలాగే జిల్లాలో కౌలురైతులు 80 వేల మంది ఉన్నప్పటికీ కేవలం 62 వేల మందే ఉన్నారని గుర్తించిన యంత్రాంగం ఇందులో 18 వేల మందికి గత ఏడాది రుణ అర్హత కార్డులి చ్చింది. ఇందులోనూ 13 వేల మంది పాత వారికి రుణాలను రెన్యు వల్ చేసింది తప్ప ఎటువంటి కొత్త రుణాలు ఇవ్వలేదు. ఈ 13 వేల మందికి రుణ ప్రణాళిక ప్రకారం ఇవ్వాలంటే రూ. 120 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ జిల్లాలో 13 వేల మందికి కేవలం రూ. 4 కోట్లు మాత్రమే ఇచ్చారు. పోనీ వీరికయినా రుణాలు మాఫీ అవుతాయని అనుకుంటే ఈ దఫా చంద్రబాబు ప్రకటించిన దానిలో కౌలురైతుల సమాచారమే లేదు. అదేవిధంగా డ్వాక్రా రుణాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 42, 600 గ్రూపులు రు.340 కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో కూడా వడపోత పోసి 39,530 గ్రూపులకు రూ.250 కోట్లు మాత్రమే మాఫీకి అర్హులని తేల్చారు. అయితే డ్వాక్రా రుణాల సంగతి తేల్చని తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు సాధికారత సంస్థ అని, రిజర్వు బ్యాంకులు మోకాలడ్డుతున్నాయని చెబుతోంది.
 
 గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన ఎలిశెట్టి సత్యనారాయణ కౌలురైతు. ఆయన గ్రామంలోని ఓ వ్యక్తి దగ్గర ఎకరాన్నర భూమిని కౌలుకు తీసుకున్నాడు. సాగు చేసేందుకు బ్యాంకులో రూ.15 వేల రుణం తీసు కున్నాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే రుణమాఫీ అవుతుందని ఆశించాడు. కాని ఆయన మాట ల్లో కౌలు రైతుల ప్రస్తావన రాకపోవడంతో సత్యనారా యణ దిగాలు చెందుతున్నాడు. ముఖ్యమంత్రి హామీల అమలు తీరు చూసి ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని కౌలురైతులందరి పరిస్థితి ఇలానే ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement