నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్' | Chandrababu Naidu faced the ire at Nagaram of East Godavari | Sakshi
Sakshi News home page

నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్'

Published Fri, Jun 27 2014 5:16 PM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్'

నగరంలో 'సీఎం డౌన్ డౌన్.. చంద్రబాబు గో బ్యాక్'

నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరం దుర్ఘటన స్థలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పలుమార్లు ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించకోకపోవడంపై స్ధానికులు, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 
 
'సీఎం డౌన్ డౌన్', 'చంద్రబాబు గోబ్యాక్' అంటూ చేసిన నినాదాలు చేయడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులను బుజ్జగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్డంతో అక్కడ కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement