బాధ్యులపై కఠిన చర్యలు: చంద్రబాబు
నగరం: ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాల పిల్లలకు టెన్త్ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.
కమిటీ సమర్పించే తుదినివేదిక ఆధారంగా ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు మీడియాతో అన్నారు. నగరం గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా గెయిల్ తీర్చిదిద్దుతుందని, మృతుల కుటుంబాల పేరుపై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.