
'చంద్రబాబు జిత్తులమారి నక్క....'
నల్గొండ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు జిత్తులమారి నక్క అని ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతల్లో ముగినిపోయే నావ అని గుత్తా వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావటం కల్లేనని గుత్తా అన్నారు. బాబు పరిస్థితి ఇప్పుడు కుడితలో పడిన ఎలుకలా ఉందని ఎద్దేవా చేశారు.
సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ కల సాకారమైందని గుత్తా పేర్కొన్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ ...సోనియా గాంధీతో చర్చల తర్వాతనే పొత్తా....విలీనమా అనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. తాను అయితే టీఆర్ఎస్...కాంగ్రెస్లో విలీనం కావాలనుకుంటున్నానని గుత్తా తెలిపారు.