శాసనసభలో చంద్రబాబు వాడిన భాష ఇది... | chandrababu naidu language in andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

శాసనసభలో చంద్రబాబు వాడిన భాష ఇది...

Published Tue, Mar 17 2015 1:27 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

శాసనసభలో చంద్రబాబు వాడిన భాష ఇది... - Sakshi

శాసనసభలో చంద్రబాబు వాడిన భాష ఇది...

ఎక్కడికొస్తారు..? ఎగిరిపడతారా..? ఇది హౌజ్.., మీ ఊరు కాదు..!
రౌడీయిజం ఎవరూ చేయలేరు ఇక్కడ..!, మీ తండ్రి వల్లే కాలేదు, నువ్వెంత
దయచేసి గుర్తు పెట్టుకోవాలి, సభ్యులు, ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి
రౌడీయిజం చేయడానికి వేదిక కాదు,
మీరు ముందే చెప్పారు అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తామని.., ఇదే అగ్లీ సీన్స్  మీరు క్రియేట్ చేసేది..!
అది మాకు తెలుసు, మీ వల్ల కాదు, హౌజ్‌ను ఎట్లా రన్ చేయాలో మాకు తెలుసు
మీరనుకున్నట్టు జరగడానికి కాదు, నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. ప్రజానీకాన్ని కోరుతున్నా..
ఈ హౌజ్‌లో ఇది తేలాల్సిన అవసరం ఉంది
మేం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం
దీనికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే..
ఆ రోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, ఆ తర్వాత పార్లమెంటును సమావేశపరిచే పరిస్థితి కొచ్చారు..

ఇది సభ్యత కాదు, సభ్యత  ఉన్న వాళ్లయితే కూర్చొవాలి
వీళ్ల ఇష్టం ప్రకారం మాట్లాడలేరు, ఉన్నట్టు మాట్లాడలేరు, నేను అప్పీల్ చేస్తున్నా..
ఇది మంచి పద్ధతి కాదు, శక్తి లేనప్పుడు ఇలా మాట్లాడుతారు,
మీరనుకుంటున్నారు.. మీ ఇష్ట ప్రకారం జరుగుతుందని,
కనీసం మీరు ప్రజల్లోకి కూడా వెళ్లలేరు, పిచ్చిపిచ్చిగా చేస్తే..
ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష..
సభ్యత లేని మనుషులు అధ్యక్షా.. వీళ్లు

మీ కథ ఏంటో తేలుస్తాం, వదిలిపెట్టబోం మిమ్మల్ని, పిచ్చి ఆటలు ఆపండి
పోయి కూర్చొండి ముందు...
దయ చేసి కూర్చొండి, పిచ్చి ఆటలు ఆడొద్దు
తమాషాలు ఆడతారు, ఇది హౌజ్ అనుకున్నారా.? ఇళ్లు అనుకున్నారా.?
మర్యాదగా చెబుతున్నాం..

తమాషాలు ఆడుతున్నారు, ఇడుపులపాయ కాదు, లోటస్‌పాండ్ కాదు, పిచ్చి పిచ్చి పట్టింది నీకు
ఎందుకు అధ్యక్ష.. అంత భయం, అంత పిరికితనం..?
ఎంత సేపు చేస్తున్నారు చూడండి..
డౌన్‌ డౌన్‌ అంట.. నన్ను డౌన్‌ అంటావా.., నన్ను డౌన్‌ డౌన్‌ అనే అర్హత నీకు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.
ప్రజాస్వామ్యానికి అపహాస్యం ఇది,
యాజ్‌ లీడర్‌ ఆఫ్‌ ది హౌజ్‌,.. ఐ యామ్‌ హేవింగ్‌ ఎవ్రీ రైట్‌..
ఆ మాత్రం కూడా మీకర్థం కాకుంటే ఏమి చేస్తాం
ప్రజా వ్యతిరేక విధానాలు కాదు,
సిగ్గు లేదు, మీరు మనుషులు కారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement