
తెలుగువారు నిరూపించారు: చంద్రబాబు
కాలిఫోర్నియా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అమెరికా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన కాలిఫోర్నియాలోని శాన్‌హౌజ్‌లో మాట్లాడుతూ ప్రపంచాన్నే జయించవచ్చని తెలుగు వారు నిరూపించారని, బాహుబలి చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి అద్భుతంగా తీశారని ప్రశంసించారు. రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా తెలుస్తోందన్నారు.
ప్రపంచం మొత్తం తెలుగువాళ్లు ఉన్నారని,ఒక్కొక్కరు ఒక్కో బాహుబలిగా తయారు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అత్యున్నత నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలని ఆయన అన్నారు. తాము అమెరికాలో ఉన్నామా... అమరావతిలో ఉన్నామా అనే భావన రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.