29న విశాఖకు సీఎం రాక | chandrababu naidu Visakhapatnam tour in 29 | Sakshi
Sakshi News home page

29న విశాఖకు సీఎం రాక

Published Thu, Sep 25 2014 12:36 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

29న విశాఖకు సీఎం రాక - Sakshi

29న విశాఖకు సీఎం రాక

సాక్షి,విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29న నగర పర్యటనకు రానున్నారు. ఆరోజు ఉదయం మధురవాడ ఐటీ సెజ్‌లో రూ.23 కోట్లతో నిర్మించిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆతర్వాత ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరగనున్న డ్వాక్రా బజార్‌ను ప్రారంభిస్తారు. ఐటీ కంపెనీల సీఈవోల సదస్సుకు హాజరుకానున్నారు. వాస్తవానికి ఈనెల 29న సీఎం పర్యటన ఖరారైంది.

ఇంక్యుబేషన్ సెంటర్ పనులు నత్తనడకగా నడుస్తుండడంతో సీఎం పర్యటన నాటికి పూర్తయ్యే అవకాశం కనిపించలేదు. దీంతో ఇంక్యుబేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సీఎం పర్యటన రద్దయినట్లు వెల్లడించారు.  29న పర్యటన ఉం డకపోతే ఆ తర్వాత ఇంక్యుబేషన్ సెంటర్ పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టడం..అన్నింటికిమించి ఐటీ కంపెనీల సీఈవోల సదస్సు

రద్దుచేస్తే ఆతర్వాత వీరిని సమావేశపర్చడం మరింత కష్టసాధ్యమవుతుందనే భావనతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి పర్యటనను ఖరారుచేశారు. ఈనేపథ్యంలో జిల్లా ఏపీఐఐసీ అధికారులు సీఎం పర్యటన కోసం ఇంక్యుబేషన్ కేంద్రం పనులను  యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement