
మంత్రి రావెలకు చంద్రబాబు వార్నింగ్
మంత్రి రావెల కిశోర్ బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుపై రావెల చేసిన వ్యాఖ్యలపై బాబు మంగళవారం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
మంత్రి రావెల కిశోర్ బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుపై రావెల చేసిన వ్యాఖ్యలపై బాబు మంగళవారం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బీజేపితో పొత్తు విషయమై తాము పునరాలోచన చేసుకుంటామని రావెల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాము తమ పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కూడా కిశోర్ బాబు అన్నారు. దీనిపై రావెలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఇంటికి పిలిపించుకుని వివరణ కోరినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.