విభజన ప్రకటన రాగానే మౌనంగా ఉండి ఇప్పుడెందుకు?
తెలంగాణ ఇవ్వాలని ఇప్పటికే లేఖ ఇచ్చాం
దాని గురించి వారు నిలదీస్తే ఏం చెబుతాం?
పార్టీ నేతల అభ్యంతరంతో టీడీపీ అధినేత పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. విభజన ప్రకటన వెలువడిన వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఇప్పుడేదో మాట్లాడటం వల్ల ప్రయోజనమేముంటుందని నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసినా, ప్రధానిని కలిసినా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ గతంలో లేఖ ఇచ్చిన విషయాన్ని వారు ప్రస్తావిస్తే ఏం సమాధానమిస్తామంటూ నేతలు బాబును నిలదీయడంతో ఢిల్లీ వెళ్లే ఆలోచనను వాయిదా వేసుకోవాలన్న అభిప్రాయానికి ఆయన వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చి ఇప్పుడు సీమాంధ్రలో ఆందోళనలతెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేయగా ఆ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు రూ. 4-5 లక్షల కోట్లు అవసరమవుతుందని...ఆ సొమ్మును కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. అయితే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజలు ప్రారంభించిన సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరం కావడంతో ఇరకాటంలోపడ్డారు. దీనికితోడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీమాంధ్ర ప్రాంతానికి చేయాల్సినవన్నీ చేశాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించడం వంటి పరిణామాల నేపథ్యంలో కిరణ్ ప్రస్తావించిన అంశాలను పేర్కొంటూ ప్రధానికి లేఖ రాశారు. కానీ తెలంగాణ ఇవ్వాలంటూ ఇదివరకే పార్టీ వైఖరిని కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాక ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలవాలి? ఏమని చెప్పాలి? అనే ప్రశ్నలు తలెత్తడంతో బాబు ఆలోచనలోపడ్డారు. దీంతో పార్టీ నేతలను పిలిపించుకుని ఢిల్లీ వెళ్లడంపై సుదీర్ఘంగా తర్జనభర్జన పడినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
బాబు ఢిల్లీ టూర్ వాయిదా!
Published Tue, Aug 13 2013 5:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement